Vikarabad: వికారాబాద్ అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు ప్రమాదం!

Vikarabad: వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఎస్పీ స్నేహ మెహ్రా, కలెక్టర్ క్షతగాత్రులను పరామర్శించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 3 Oct 2026 2:05 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు ప్రమాదం!

Vikarabad: వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ తక్షణమే స్పందించింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం కేసారం గ్రామానికి చెందిన ప్రయాణికులు దారూర్ మండలం చింతకుంట గ్రామానికి అంత్యక్రియలకు వెళ్తుండగా అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది.

ప్రమాద సమాచారం అందుకున్న వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారు సంఘటనా స్థలాన్ని వెంటనే వెళ్లి ప్రమాద పరిస్థితులను పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసు అధికారులను అడిగి ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవడం, సహాయక చర్యలను సమన్వయం చేయడంపై అధికారులకు సూచనలు చేశారు.

అనంతరం జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారు జిల్లా కలెక్టర్‌తో కలిసి వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారికీ మెరుగైన వైద్య చికిత్స అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వైద్యులను ఆదేశించారు. క్షతగాత్రులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ప్రమాద ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. బాధితులకు తక్షణ సహాయం అందించడంతో పాటు, ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు ఎస్పీ గారు తెలిపారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD