Shabad: చెట్టుకు ఉరివేసుకుని ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య!

Shabad: షాబాద్ మండలం నాగర్‌కుంటలో విషాదం చెట్టుకు ఉరివేసుకుని ప్రైవేట్ ఉద్యోగి చిర్ర సునీల్ (21) ఆత్మహత్య.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఇన్‌స్పెక్టర్ చెన్నారెడ్డి.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 28 Sept 2026 7:42 PM IST
Shabad
X

Shabad: చెట్టుకు ఉరివేసుకుని ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య!

షాబాద్: షాబాద్ మండలం నాగర్‌కుంట గ్రామానికి చెందిన చిర్ర సునీల్ (21) అనే ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఇన్స్పెక్టర్ చెన్నారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 27న ఉదయం సుమారు 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన సునీల్ రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో నాగర్‌కుంట రోడ్డులోని మోడల్ స్కూల్ సమీపంలో అడ్వకేట్ సత్యనారాయణకు చెందిన భూమిలోని చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో సునీల్ కనిపించాడు. కుటుంబ సభ్యులు అతడిని కిందకు దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై షాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA