Vikarabad: ఆచార్య జయశంకర్‌కు వికారాబాద్ వైద్య సిబ్బంది ఘన నివాళి!

Vikarabad: వికారాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 6 Aug 2026 4:39 PM IST
Vikarabad: ఆచార్య జయశంకర్‌కు వికారాబాద్ వైద్య సిబ్బంది ఘన నివాళి!
X

వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, తెలంగాణ భావజాలకర్త ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సుబోద్ కుమార్, వైద్యులు, డాక్టర్ రాంచెంద్రయ్య, RMO, డాక్టర్ చెంద్రశేఖర్, నర్సింగ్ అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డా. సుబోద్ కుమార్ మాట్లాడుతూ, "తెలంగాణ అంటే జయశంకర్.. జయశంకర్ అంటే తెలంగాణ. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి ఆయన. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి" అని పేర్కొన్నారు.

ICTC కౌన్సిలర్ రత్నాకర్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక ఉద్యమం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి. ఆయన ఆశయాలు ప్రతి తెలంగాణ బిడ్డకు స్ఫూర్తిగా నిలుస్తాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ROM డా. చంద్రశేఖర్, నర్సింగ్ సూపరింటెండెంట్ శాంతాబాయి, వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘనంగా నివాళులర్పించారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story