Hyderabad: రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల రక్షణే కాంగ్రెస్ లక్ష్యం!

Hyderabad: హైదరాబాద్‌లో పీసీసీ నిర్వహించిన సంవిధాన్ రక్షక్ ర్యాలీలో చంద్రపురి కాలనీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ గురువారం పాల్గొన్నారు.

PURENDAR, ALWAL
Published on: 26 Nov 2026 7:33 PM IST
Hyderabad
X

Hyderabad: రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల రక్షణే కాంగ్రెస్ లక్ష్యం!

Hyderabad: ఏఐసీసీ పిలుపు మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన సంవిధాన్ రక్షక్ ర్యాలీలో చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ పరిరక్షణతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొడుగు వేణు ముదిరాజ్, సీనియర్ నాయకులు రజిత గోపాల్, ఉపాధ్యక్షులు గోనె చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, జోగి సునీత, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాహుల్ కదం, నాయకులు సాయి కృష్ణ (మిట్టు), కాలేశా, రామిరెడ్డి, నర్ర మహేష్, భాస్కర్ గౌడ్, రాము, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL