Malkajgiri: భూ సమస్యల పరిష్కారానికై సభకు తరలిరండి: గౌతమ్ నగర్ మాజీ కార్పొరేటర్!
Malkajgiri: మల్కాజిగిరి పరిధిలోని 22ఏ, యూఎల్‌సీ భూ సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 3న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొనే సభను జయప్రదం చేయాలని మాజీ కార్పొరేటర్ సునీత కోరారు.
Malkajgiri: భూ సమస్యల పరిష్కారానికై సభకు తరలిరండి: గౌతమ్ నగర్ మాజీ కార్పొరేటర్!
మల్కాజిగిరి, సెప్టెంబర్ 2: 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న నివాసితులు, ఎండోమెంట్ భూముల్లో నివసిస్తున్న వారు, యూఎల్‌సీ పరిధిలోని నివాసితులు, ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారు తమ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 3న మల్లికార్జున నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ గ్రౌండ్‌లో నిర్వహించే సభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని గౌతమ్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ పిలుపునిచ్చారు.
ఈ సభకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఆమె తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఆయా సమస్యలపై చర్చించి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత సమస్యలతో ఉన్న నివాసితులందరూ తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేకల సునీత రాము యాదవ్ కోరారు.




