Pudur: డంపింగ్ యార్డుపై యుద్ధం పూడూరు ప్రజలు వర్సెస్ మేడ్చల్ మున్సిపాలిటీ
Pudur: పూడూరును మరో జవహర్ నగర్ కానివ్వబోమని మేడ్చల్ పూడూరు గ్రామస్తుల ఆందోళన. సర్వే నంబర్ 371లో చెత్త వాహనాలను అడ్డుకున్న మాజీ సర్పంచ్ బాబు యాదవ్ బృందం.
Pudur: డంపింగ్ యార్డుపై యుద్ధం పూడూరు ప్రజలు వర్సెస్ మేడ్చల్ మున్సిపాలిటీ
పూడూర్: మేడ్చల్ సర్కిల్ పరిధి పూడూరు-కిష్టాపూర్ డివిజన్ లోని పూడూరులో ఉన్న సర్వేనెంబర్ 371లో చెత్తను డంపింగ్ చెయ్యడానికి తెస్తున్న వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు.కాగా విషయం తెలుసుకున్న సానిటేషన్ ఇన్స్పెక్టర్ ఘటన స్థలానికి విచ్చేశారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బాబు యాదవ్,మాజీ వార్డు సభ్యుడు యాటవెల్లి హన్మంత్ రెడ్డి,గ్రామస్తులు జీ. పరమేశ్ డిప్యూటీ కమిషనర్ సుదాంశుకు ఫోన్ చేసి మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మొత్తం చెత్తను వాహనాల ద్వారా తరలిస్తూ పూడూరు డంపింగ్ యార్డ్ లో పొయ్యడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ డంపింగ్ యార్డుకు సమీపంలోనే ప్రతిష్టాత్మకమైన నల్సార్ యూనివర్సిటీ,ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కళాశాల,భాగ్యనగర్ గ్యాస్ తో పాటు పలువురు రైతుల వ్యవసాయ భూములు ఉన్నాయని పేర్కొన్నారు.పూడూరు గ్రామాన్ని మరో జవర్ నగర్ కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ డిప్యూటీ కమిషనర్ సందర్భంగా సుదాంషు మాట్లాడుతూ పూడూరులో తాత్కాలికంగా సర్కిల్ పరిధిలోని చెత్తను వేయడం జరుగుతుందని త్వరలోనే వెయ్యకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




