Moinabad: మొయినాబాద్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పులగల్ల కుమార్!

Moinabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పులగల్ల కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 11 Oct 2026 12:50 PM IST
Moinabad
X

Moinabad: మొయినాబాద్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పులగల్ల కుమార్!

Moinabad: చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామెన భీం భరత్ సహకారంతో, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ ఆధ్వర్యంలో పులగల్ల కుమార్ మొయినాబాద్ మండల్ మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పులగల్ల కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామెన భీం భరత్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్, మొయినాబాద్ మండల్ & మున్సిపల్ అధ్యక్షులు బొలిగిద్ధ సత్యనారాయణ, విక్రమ్ రెడ్డి, మాజీ అధ్యక్షులు మానయ్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఎస్సీ సెల్ అభివృద్ధికి మరియు ఎస్సీ వర్గాల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA