Hyderabad: పల్స్ ఫార్మా నానో-విటమిన్ D3కి కీలక ఆమోదం!

Hyderabad: హైదరాబాద్‌కు చెందిన పల్స్ ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి నానో-క్యారియర్ విటమిన్ D3 ఓరల్ డిస్పర్షన్‌కు నియంత్రణ సంస్థల ఆమోదం లభించింది.

RAJESH,	WEST ZONE
Published on: 20 Aug 2026 5:16 PM IST
Hyderabad
X

Hyderabad: పల్స్ ఫార్మా నానో-విటమిన్ D3కి కీలక ఆమోదం!

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న పల్స్ ఫార్మాస్యూటికల్స్‌కు కీలక విజయం లభించింది. సంస్థ అభివృద్ధి చేసిన నానో-క్యారియర్ ఆధారిత విటమిన్ D3 ఓరల్ డిస్పర్షన్‌కు నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ప్రపంచంలోనే ఈ తరహా నానో-క్యారియర్ విటమిన్ D3 ఉత్పత్తికి ఇదే తొలి ఆమోదమని సంస్థ తెలిపింది.

క్లినికల్ అధ్యయనాల్లో సంప్రదాయ ఫార్ములేషన్లతో పోలిస్తే సీరం విటమిన్ D స్థాయిలు 50 నుంచి 60 శాతం అధికంగా ఉన్నట్లు వెల్లడైందని పేర్కొంది. విటమిన్ D3తో పాటు విటమిన్ K2-7, B12, ఐరన్ తదితర పోషకాలు, పలు సాధారణ ఔషధాలపై కూడా తమ నానో టెక్నాలజీని విస్తరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. భారత్‌తో పాటు అమెరికా, రష్యా, మెక్సికో, ఆస్ట్రేలియాలో పేటెంట్లు కలిగి ఉన్న పల్స్ ఫార్మాస్యూటికల్స్.. ప్రపంచ మార్కెట్లలో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story