Hyderabad: గణేష్ నిమజ్జనంలో మూగజీవులతో డాన్స్..కొండచిలువను రక్షించిన పోలీసులు!
Hyderabad: హైదరాబాద్ గణేష్ శోభాయాత్రలో కొండచిలువ, కోడితో వినోద ప్రదర్శనలు చేసిన బృందం అరెస్ట్.
Hyderabad: గణేష్ నిమజ్జనంలో మూగజీవులతో డాన్స్..కొండచిలువను రక్షించిన పోలీసులు!
Hyderabad: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో మూగజీవులతో డాన్స్ చేయించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. బహిరంగ ప్రదర్శనల్లో కొండచిలువ, కోడితో వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్న బృందాన్ని జీహెచ్‌ఎస్‌పీసీఏ, మధురానగర్ పోలీసులు జవహర్‌నగర్‌లో గుర్తించి, జంతువులను రక్షించారు.
విశాఖపట్నం నుంచి ఈ బృందాన్ని ఐదు రోజుల పాటు అనుసరించిన అధికారులు, సెప్టెంబర్ 20న పట్టుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం రక్షిత జాతికి చెందిన కొండచిలువను వినోదం కోసం ప్రదర్శించడం చట్టవిరుద్ధమని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపట్టినట్లు సమాచారం.




