LB Nagar: నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌తో ముంచేశారు
LB Nagar: ఖతర్ యూనివర్సిటీలో లెక్చరర్ ఉద్యోగం పేరిట హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.4.64 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు.
LB Nagar: నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌తో ముంచేశారు
LB Nagar: ఎల్బీనగర్, నాగోలు బండ్లగూడ సమీపంలోని కార్పొరేట్ భవన్ ప్రాంతంలో నివసించే వెంకట్రెడ్డి ఉద్యోగం కోసం Naukri.com లో తన రెజ్యూమ్ ను అప్లోడ్ చేశాడు. గత మే నెల 5న దానికి స్పందించిన ఓ అపరిచితుడు తనను Naukri Gulf Service సంస్థకు చెందిన ప్రతినిధి దినేష్ మిట్టల్ గా పరిచయం చేసుకున్నాడు.
ఖతర్ దేశంలోని ఖతర్ యూనివర్సిటీ లో అధ్యాపకునిగా ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. రిక్రూట్మెంట్ ఫార్మాలిటీల కోసం పలు దఫాలుగా రూ.4.64 లక్షలు వసూలు చేశాడు. అనంతరం ఓ ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ ను అతనికి పంపించాడు. ఉద్యోగంలో చేరేందుకు జరిగే వెరిఫికేషన్ కోసం దిల్లీకి హాజరు కావాలంటూ ఖతర్ యూనివర్సిటీ పేరిట ఓ ఫేక్ ఈమెయిల్ ను కూడా పంపాడు.
ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




