Quthbullapur: గణేష్ ఉత్సవాలు హిందువుల ఐక్యతకు ప్రతీక.. ఆకుల సతీష్!
Quthbullapur: కుత్బుల్లాపూర్ చింతల్‌లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సమావేశం. గణేష్ ఉత్సవాలను సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని అసెంబ్లీ కన్వీనర్ ఆకుల సతీష్ పిలుపు.
Quthbullapur: గణేష్ ఉత్సవాలు హిందువుల ఐక్యతకు ప్రతీక.. ఆకుల సతీష్!
Quthbullapur: సనాతన హిందూ ధర్మంలో వినాయక చవితి, 11 రోజుల గణేష్ ఉత్సవాలు హిందువుల ఐక్యత, సామరస్యానికి ప్రతీకలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల సతీష్ అన్నారు.
రాబోయే వినాయక చవితి ఉత్సవాలను కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలో ఘనంగా, ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు.
ఈ మేరకు చింతల్‌లోని జై కన్వెన్షన్ బ్యాంక్వెట్ హాల్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో డివిజన్ కమిటీల విస్తృత స్థాయి సమావేశం అసెంబ్లీ కన్వీనర్ ఆకుల సతీష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి సమితి సెంట్రల్ కమిటీ సెక్రటరీ రమేష్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
గత 49 సంవత్సరాలుగా హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల విజయవంతమైన నిర్వహణకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కృషి చేస్తోందని ఆయన తెలిపారు. కుత్బుల్లాపూర్ పరిధిలో కూడా దేవాలయాలు, వినాయక మండపాల నిర్వాహకులు, వివిధ హిందూ సంఘాలు, కాలనీల పెద్దలతో సమన్వయం చేసుకుని హిందువులందరినీ సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని డివిజన్లలో కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి బలమైన హిందూ ఐక్యతను చాటాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా మండప నిర్వాహకులు, అధికారులు, వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ గణేష్ ఉత్సవాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
అసెంబ్లీ పరిధిలో 8 మంది కో-కన్వీనర్లు, 11 డివిజన్ కన్వీనర్లు, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు 9 నిమజ్జన పాయింట్ల వద్ద ప్రత్యేక బాధ్యులను నియమించి అధికారులతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు.
రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నిమజ్జన పాయింట్ల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు ఈ నెల 10వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను కోరామని తెలిపారు. వినాయక మండపాల ఏర్పాటు, విద్యుత్, పోలీస్ అనుమతుల విషయంలో నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో-కన్వీనర్లు జై శంకర్, కట్ట కుమార్, పులి బలరాం, గరిగే శేఖర్, అరుణ్ రావు, మల్లారెడ్డి, మహిళా ఇన్‌చార్జ్ సుహాసిని శక్తి, లీగల్ ఇన్‌చార్జ్ శివానంద్, కో-ఇన్‌చార్జ్ కోడి ఆదిత్య, డివిజన్ కన్వీనర్లు పొలబోయిన శ్రీనివాస్, కృష్ణారెడ్డి, సతీష్ సాగర్, నాగరాజు, విఘ్నేష్ ముదిరాజు, రామ్ సాయి యాదవ్, శంకర్, పరుశు వేణు, మాధవులు, శరత్ గౌడ్, పెద్దలు కంది శ్రీరాములు, వేణుగోపాల్, వేణు గౌడ్, వివిధ డివిజన్ల కో కన్వీనర్లు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




