Quthbullapur: ఓటింగ్ శాతం పెంపుపై డీసీ లావణ్యకు బొమ్మ శ్రీధర్ వినతి!

Quthbullapur: సమీపంలోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఓటింగ్ శాతం పెంచాలని డీసీ లావణ్యకు కుత్బుల్లాపూర్ బీజేపీ నేత బొమ్మ శ్రీధర్ వినతిపత్రం అందజేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 30 July 2026 12:02 PM IST
Quthbullapur
X

Quthbullapur: ఓటింగ్ శాతం పెంపుపై డీసీ లావణ్యకు బొమ్మ శ్రీధర్ వినతి!

కుత్బుల్లాపూర్ బొమ్మ శ్రీధర్

ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి

ఓటర్లు ఒక ప్రాంతంలో ఉంటే పోలింగ్ కేంద్రాలు మరో చోట ఏర్పాటు చేయడంతో గతంలో ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఇబ్బందులు పడ్డా రని స్థానిక నేతలు వాపోయారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం పోలింగ్ కేంద్రాలను ఓటర్లకు అందుబాటులో ఏర్పాటు చేసి ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని భాజపా నేతలు బుధవారం డీసీ లావణ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను కొంపల్లి ప్రాంతంలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించా లని ఉపకమిషనర్ నాయకులను కోరారు. కొంపల్లి భాజపా అధ్యక్షుడు సతీష్, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story