Quthbullapur: కుత్బుల్లాపూర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ - పాల్గొన్న ఎంపీ ఈటల

Quthbullapur: కుత్బుల్లాపూర్ ఐడీపీఎల్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ. జాతీయ జెండాను చేతబూని పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 13 Aug 2026 6:29 PM IST
Quthbullapur
X

Quthbullapur: కుత్బుల్లాపూర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ - పాల్గొన్న ఎంపీ ఈటల

కుత్బుల్లాపూర్: భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఐడీపీఎల్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “తిరంగా ర్యాలీ”లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

జాతీయ జెండాను చేతబూని ర్యాలీలో పాల్గొన్న ఈటల రాజేందర్, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..

విభిన్న జాతులు, సంస్కృతులు, భాషలు ఉన్నప్పటికీ కలిసి జీవించే దేశం భారతదేశమని అన్నారు. మనందరం భారతమాత ముద్దుబిడ్డలమని పేర్కొన్నారు. జనగణమన, వందేమాతరం వంటి జాతీయ భావనలు అసేతు హిమాచలం భారతీయులను ఐక్యంగా ఉంచుతున్నాయని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ పటంపై భారతదేశ ఔన్నత్యం సమున్నతంగా నిలుస్తోందన్నారు. దేశ అభివృద్ధి కోసం మోదీ కి ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి, ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు మరియు ఇంచార్జి మల్లారెడ్డి, వడేపల్లి రాజేశ్వర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి, జిల్లా జనరల్ సెక్రెటరీ విగ్నేష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు శేఖర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శేషగిరి రావు, కూకట్‌పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ కాంత రావు, కన్వీనర్ శ్రీకర్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్ల జయశేఖర్ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, సీనియర్ నాయకులు వేముల రమేష్, బీజేవైఎం నాయకులు శ్రీనాథ్, సాయి కిరణ్ రెడ్డి, ఆర్తిక్ యాదవ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story