Hyderabad: ఫీజు బకాయిలపై సీఎం రేవంత్‌తో తాడోపేడో ఆర్.కృష్ణయ్య హెచ్చరిక

Hyderabad: ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు విడుదల చేయాలని మాసబ్ ట్యాంక్ విద్యామండలి ముందు ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో మహాధర్నా.

GIRI, CENTRAL ZONE
Published on: 4 July 2026 7:05 PM IST
Hyderabad
X

Hyderabad: ఫీజు బకాయిలపై సీఎం రేవంత్‌తో తాడోపేడో ఆర్.కృష్ణయ్య హెచ్చరిక

హైదరాబాద్: ఫీజు రియంబర్స్ మెంట్ పథకం విషయంలో... రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని... బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ... బీసీ విద్యార్థి, యువజన సంఘం ఆధ్వర్యంలో... మాసబ్ ట్యాంక్ ఉన్నత విద్యా మండలి ముందు నిర్వహించిన మహా ధర్నాలో... విద్యార్థులతో పాటు ముఖ్యఅతిథిగా ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు.

ఫీజుల బకాయిలు చెల్లించాలని... పాత విధానం కొనసాగించాలని... ఈనెల 8న ఇందిరా పార్కు వద్ద సత్యగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు కృష్ణయ్య వెల్లడించారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టకు పోకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని... వెంటనే 8వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరారు. కొత్త విధానం జీవో నెంబర్ 9 ఆచరణలో అమలులో సాధ్యం కాదని... తక్షణమే రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి ఫీజులు విడుదల కాకపోవడంతో... విద్యార్థుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందన్నారు. ఉద్యమాల సంవత్సరంగా ప్రకటించక ముందే... ముఖ్యమంత్రి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని... కృష్ణయ్య డిమాండ్ చేశారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE

Next Story