Boduppal: బోడుప్పల్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
Boduppal: బోడుప్పల్‌లో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Boduppal: బోడుప్పల్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
బోడుప్పల్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని బోడుప్పల్ లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. బోడుప్పల్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు.
దేశ ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు మరింత బలంగా, అభివృద్ధి దిశగా సాగాలంటే రాహుల్ గాంధీ వంటి నాయకత్వం అవసరమని అన్నారు. మాజీ మేయర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ, దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే దూరదృష్టి, ప్రజల పట్ల అంకితభావం కలిగిన నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు.
దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగల నాయకత్వం ఆయనదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకులు రాపోలు రాములు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.




