Tarnaka: లాలాగూడ రైల్వే వర్క్‌షాప్ వద్ద ఉద్యోగుల నిరసన!

Tarnaka: లాలాగూడ రైల్వే వర్క్‌షాప్ వద్ద 74 పోస్టుల పునర్విభజనను నిరసిస్తూ ఆందోళన.

HARISH, TARNAKA
Published on: 30 July 2026 12:21 PM IST
Tarnaka
X

Tarnaka: లాలాగూడ రైల్వే వర్క్‌షాప్ వద్ద ఉద్యోగుల నిరసన!

Tarnaka: లాలాగూడ రైల్వే వర్క్‌షాప్ నుండి పునర్విభజన చేసిన 74 పోస్టులను వెంటనే నిలిపివేసి, తిరిగి లాలాగూడ రైల్వే వర్క్‌షాప్‌కే కేటాయించాలని డిమాండ్ చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ (SCRES), మజ్దూర్ యూనియన్, ఎస్సీ/ఎస్టీ & ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్, IRTSA సూపర్‌వైజర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ, లాలాగూడ రైల్వే వర్క్‌షాప్ నుండి 74 పోస్టుల పునర్విభజన వల్ల వర్క్‌షాప్ పనితీరుతో పాటు రైల్వే ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పునర్విభజన చేసిన 74 పోస్టులను వెంటనే రద్దు చేసి, వాటిని తిరిగి లాలాగూడ రైల్వే వర్క్‌షాప్‌కే కేటాయించాలని, అలాగే రైల్వే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర రైల్వే శాఖ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న SCRES జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఆదం సంతోష్ కుమార్ మాట్లాడుతూ, గతంలో బోనస్ డిమాండ్ సాధన కోసం నిర్వహించిన ఉద్యమాన్ని విజయవంతం చేసినట్లే, ఈ సమస్య పరిష్కారం కోసం కూడా అదే స్థాయిలో ఉద్యమాన్ని నిర్వహిస్తామని అన్నారు. పునర్విభజన చేసిన 74 పోస్టులను తిరిగి లాలాగూడ రైల్వే వర్క్‌షాప్‌కు కేటాయించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేసి, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో sangh డివిజనల్ సెక్రటరీ ఎం.జీ. అరుణ్ కుమార్, డిప్యూటీ డివిజనల్ సెక్రటరీ ఎం. నరేష్, వర్క్‌షాప్ చైర్మన్ ఆదం చంద్రశేఖర్, సీడబ్ల్యూసీ సభ్యురాలు జె. చంద్రకళ, cwc సభ్యుడు రవికాంత, మజ్దూర్ యూనియన్ బుచ్చి రెడ్డి , బ్రాంచ్ సెక్రటరీ కె. బాలకృష్ణ రెడ్డి, సూపర్‌వైజర్స్ సెక్రటరీ మహిపాల్ రెడ్డి, ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ సెక్రటరీ అరవింద్ , ఓబీసీ అసోసియేషన్ సెక్రటరీ రాజేందర్ , అలాగే వివిధ సంఘాల కార్యవర్గ సభ్యులు మరియు రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story