Secunderabad: రూ. 20 లక్షల విలువైన గంజాయితో దొరికిపోయిన అంతర్రాష్ట్ర ముఠా

Secunderabad: జిఆర్పీ, ఆర్‌పీఎఫ్ ఈగల్ ఫోర్స్ జరిపిన సంయుక్త తనిఖీల్లో 41 కిలోల గంజాయి పట్టుబడింది. మహారాష్ట్రకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Srikanth, Secunderabad
Published on: 6 July 2026 8:13 PM IST
Secunderabad
X

Secunderabad: రూ. 20 లక్షల విలువైన గంజాయితో దొరికిపోయిన అంతర్రాష్ట్ర ముఠా

సికింద్రాబాద్: అంతర్రాష్ట్రియా గంజాయి ముఠాను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 41 కిలోల గంజాయిని దాదాపు 20 లక్షల విలువ గల ఈ గంజాయిని జి ఆర్ పి మరియు తెలంగాణ ఈగల్ ఫోర్ట్స్ ఆర్ పి ఎఫ్ సమిష్టి తనిఖీల్లో భాగంగా రైళ్లలో గంజాయి మరియు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై నిఘా ఏర్పాటు చేసి అకస్మాత్ తనిఖీలు చేస్తుండగా ఒరిస్సా బలంగీర్ నుండి సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాన నిందితుడు ఒడిశా కి చెందిన సంజు సహా పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సంజీవ్ నుండి గంజాయిని తీసుకొని మహారాష్ట్రకు చెందిన మహేష్ దిలీప్ కార్తీక్ చంద్రకాంత్, మరో బాలుడు ఉండడంతో వారిని విచారించడంతో చెడు అలవాట్లకు బానిస కావడంతో ఇలాంటి అక్రమంగా గంజాయి తరలించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నట్టు నిందితులు తెలిపినట్టు జి ఆర్ పి పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story