Hyderabad: బంగాళఖాతంలో ఆవర్తనం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వర్షాలు!
Hyderabad: బంగాళఖాతంలో ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడి.
Hyderabad: బంగాళఖాతంలో ఆవర్తనం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వర్షాలు!
Hyderabad: బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాంతో దక్షిణ తెలంగాణ మీదుగా మున్నార్ వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఏపీలో రాయలసీమ, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.




