Quthbullapur: కుత్బుల్లాపూర్ బాపూజీ స్కూల్‌లో వైభవంగా రక్షాబంధన్ వేడుకలు!
Quthbullapur: కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట బాపూజీ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్ నవ్వా ప్రభాకర్ రావు.
Quthbullapur: కుత్బుల్లాపూర్ బాపూజీ స్కూల్‌లో వైభవంగా రక్షాబంధన్ వేడుకలు!
Quthbullapur: సోదర సోదరీమణుల అనుబంధాలకు ప్రతీక పవిత్రమైన రక్షాబంధన్ అని బాపూజీ ఉన్నత పాఠశాల చైర్మన్, కరస్పాండెంట్ నవ్వా ప్రభాకర్ రావు అన్నారు. రాఖీ పండుగ పురస్కరించుకొని గురువారం జగద్గిరిగుట్ట, వెంకటేశ్వరనగర్ లో గల బాపూజీ ఉన్నత పాఠశాల లోనీ విద్యార్థిని, విద్యార్థులతో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు, పిల్లలకు తెలంగాణ లోని పండుగలను వాటి విశిష్టతలను తెలియజేస్తూ సంస్కృతి, సాంప్రదాయాల కనుగుణంగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నా మన్నారు. అనంతరం విద్యార్థినీలు విద్యార్థులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story




