Rangareddy: బీజేపీలో భారీ చేరికలు.. కమలం గూటికి వందలాది కార్యకర్తలు!

Rangareddy: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి నుంచి వందలాది మంది బీజేపీలో చేరారు.

RAVI, IBRHAMIPATNAM
Published on: 23 May 2026 7:36 PM IST
Rangareddy
X

Rangareddy: బీజేపీలో భారీ చేరికలు.. కమలం గూటికి వందలాది కార్యకర్తలు!

Rangareddy: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు బిజెపి పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు, మాజీ త్రిపుర గవర్నర్ బండారు దత్తాత్రేయ సమక్షంలో స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ బసవరాజు సురేష్ ఆధ్వర్యంలో చేరిక.

ఈ సందర్భంగా బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు మాట్లాడుతూ బిజెపి పార్టీ కి ఆకర్షితులే వందలాదిమంది చేరడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని జోష్యం చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 80 శాతం వడ్లు కొనుగోలు చేశామని చెప్తున్న నేటికీ కూడా 25% కూడా కొనుగోలు చేయలేదని, రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని, వడదెబ్బకు చాలామంది రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద చనిపోతున్న నిమ్మకు నీరెత్తినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

బిజెపి పార్టీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతుల యొక్క కష్టాలను తెలుసుకోవడానికి త్వరలోనే పర్యటించనున్నట్లు తెలిపారు.

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM

Next Story