Jawahar Nagar: జవహర్ నగర్ రాంకీ డంపింగ్ యార్డును శాశ్వతంగా ఎత్తివేయాలి

Jawahar Nagar: జవహర్ నగర్ రాంకీ చెత్త డంపింగ్ యార్డును జనావాసాల మధ్య నుండి వెంటనే ఎత్తివేయాలని సీపీఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి. సత్యం డిమాండ్ చేశారు.

PURENDAR, ALWAL
Published on: 6 Jun 2026 9:28 PM IST
Jawahar Nagar
X

Jawahar Nagar: జవహర్ నగర్ రాంకీ డంపింగ్ యార్డును శాశ్వతంగా ఎత్తివేయాలి

జవహర్ నగర్: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జవహర్ నగర్ రాంకీ చెత్త డంపింగ్ యార్డును శాశ్వతంగా ఎత్తివేయాలని సిపిఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి సత్యం డిమాండ్ చేశారు. శనివారం బాలాజీనగర్ దళిత సంక్షేమ భవన్ లో అన్ని రాజకీయ, పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు సమస్యపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ తో జవహర్ నగర్ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రమై, దుర్గంధం వెదజల్లుతున్నాయని, చెత్త కుప్పలు గుట్టలుగా పేరుకుపోయి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నివాస ప్రాంతాల మధ్యలో ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ను యుద్ధ ప్రాతిపదికన ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని యెడల డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగబోయే ప్రజా ఆందోళనలకు ప్రభుత్వమే నైతిక భాద్యత వహించాల్సి ఉంటుందని గుర్తు చేశారు.

అనంతరం సిఐటియు జిల్లా కమిటీ నాయకులు బంగారు నర్సింగ్ రావు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ మూలంగా ప్రజలు రోగాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్ ను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వంద పడకల ఆసుపత్రిని వెంటనే నిర్మించి అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు.

అనారోగ్యంతో చనిపోయిన బాధిత కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, నాణ్యమైన త్రాగునీటి కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన రాంకీ సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసి, ఎస్ టి పి ప్లాంట్ రెగ్యులర్ గా నిర్వహించే విధంగా కృషి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని నిర్వహించాలని కోరారు.

•డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ ఏర్పాటు

రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత భవిష్యత్తు కార్యాచరణ కోసం డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ జేఏసీ ని ఏర్పాటు చేశారు. జేఏసీ కి చైర్మన్ గా షేక్ షావలి, కన్వీనర్ గా ఉమామహేశ్వరరావు (సిపిఐ) కో- కన్వీనర్ గా శివన్నారాయణ (సిపిఎం), గౌరవ సలహాదారులుగా మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, ఉపసర్పంచ్ ఆర్ నర్సింహ్మ గౌడ్, కల్లెపల్లి సదానందం, కోశోధికారి శివబాబు, కో కన్వీనర్లుగా మేకల కావ్య, కొండల్ ముదిరాజ్, ఆలూరి రాజశేఖర్, లలిత యాదవ్, ఆంజనేయులు, అనురాధ, గడ్డం సదానందం, వై.మల్లేష్, ప్రపుల్ రాంరెడ్డి, పాషామీయా, సింగరాయ గౌడ్, యాకస్వామి, లను ఎన్నుకున్నారు. ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రజా, కుల సంఘాల నాయకులు జేఏసీ కమిటీ సభ్యులుగా కొనసాగుతారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ ఎంపీటీసీ తోటపల్లి శంకర్, జయసుద, అల్లూరి సావిత్రి, పికెఎం జాన్, పిడిఎం చంద్రమౌళి, పెర్క సునిత, స్వరూప, బూడిద వెంకటేష్, ప్రతాప్, యాదగిరి, రాణి, శంకర్, లక్ష్మణ్, దున్నపోతుల నర్సింహ్మ, తుమ్మరాణి, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story