Amanagal: మురుగు సమస్యకు పరిష్కారం: చైర్మన్ పత్య నాయక్!

Amanagal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ 9వ వార్డులో మురుగునీటి సమస్య పరిష్కారానికి డ్రైనేజీ పనులను చైర్మన్ పత్య నాయక్, కౌన్సిలర్ మహేష్ ప్రారంభించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 29 Oct 2026 9:52 PM IST
Amanagal
X

Amanagal: మురుగు సమస్యకు పరిష్కారం: చైర్మన్ పత్య నాయక్!

ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు మరో ముందడుగు పడింది. వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనులను గురువారం స్థానిక కౌన్సిలర్ ఎర్రవోలు మహేష్, మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జాతీయ మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యలను పరిష్కరించడంతో పాటు మెరుగైన పారిశుధ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పనులను చేపట్టారు. డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే మురుగునీటి నిల్వ సమస్య తగ్గడంతో పాటు పరిసరాల పరిశుభ్రత మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎర్రవోలు మహేష్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, వార్డు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు.

9వ వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తూ, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఆంజనేయులు, ఏఈ నరేష్, వార్డు ఆఫీసర్ రమేష్, కో-ఆప్షన్ సభ్యులు చుక్క అల్లాజి గుర్రం కేశవులు , ఖాదర్, కాలనీవాసులు బ్రహ్మచారి, గోలి శ్రీనివాస్, మల్లేష్, గోవర్ధన్, లక్కీ యాదన్న, సైదులు, ఏలే నరేష్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY