Amangal: చెన్నంపల్లిలో గ్రంథాలయ ఏర్పాటుకు సర్పంచ్ ప్రశాంతి చొరవ!
Amangal: రంగారెడ్డి జిల్లా చెన్నంపల్లిలో గ్రామీణ గ్రంథాలయ ఏర్పాటుకు సహకరించాలని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచందర్ రెడ్డిని సర్పంచ్ ప్రశాంతి రవి కుమార్ కోరారు.
Amangal: చెన్నంపల్లిలో గ్రంథాలయ ఏర్పాటుకు సర్పంచ్ ప్రశాంతి చొరవ!
ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం చెన్నంపల్లి గ్రామంలో గ్రామీణ గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు స్థానిక సర్పంచ్ ప్రశాంతి రవి కుమార్ తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చల్లా వంశీ చందర్ రెడ్డి హైదరాబాదులో లోని వారి నివాసంలో కలిసి గ్రంథాలయ ఏర్పాటుకు సహకరించాలని కోరినట్లు సర్పంచ్ తెలిపారు.
గ్రంథాలయ ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వంశీచందర్ రెడ్డి హమి ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డిసీసీకార్యదర్శి రమణారెడ్డి రాఘవేందర్ రెడ్డి వార్డు సభ్యులు కృష్ణయ్య మల్లేష్ లక్ష్మయ్య నరసింహ తదితరులు పాల్గొన్నారు.




