Shabad: షాబాద్ మండలంలో డిజిటల్ క్రాప్ సర్వే ముమ్మరం!
Shabad: షాబాద్ మండలంలోని 25 రెవెన్యూ గ్రామాల్లో ముమ్మరంగా డిజిటల్ క్రాప్ సర్వే. రైతులు ఈ ఆన్లైన్ పంట నమోదును సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి సూచన.
Shabad: షాబాద్ మండలంలో డిజిటల్ క్రాప్ సర్వే ముమ్మరం!
Shabad: మండలంలోని 25 రెవెన్యూ గ్రామాలలో ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు/ సిబ్బంది ఆయా గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తారని మండల వ్యవసాయ అధికారి, దండెం విజయచంద్ర తెలియజేశారు..
ఈ పంటల నమోదు ఆధారంగానే ప్రభుత్వం పంటల ఉత్పత్తులను (పత్తి, మొక్కజొన్న, కందులు, వడ్లు, ఇతర పంటలు) కొనుగోలు చేయడం జరుగుతుంది.
రైతులందరూ పంట నమోదు వాలంటీర్లు/ సిబ్బంది గ్రామంలో వచ్చినప్పుడు తమ పొలాల వద్ద అందుబాటులో ఉండి, సరైన పంట వివరాలను తెలియజేసి పంట నమోదు చేయించుకోవాలి, పంట నమోదు విషయంలో ఏమైనా సందేశాలు ఉంటే మీ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించగలరు.
ఈ రోజు మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర, నాగర్ కుంట సర్పంచ్ పాలమాకుల మల్లయ్య, ఏఈఓ బాబ్య నాయక్, వాలంటీర్లు వడ్ల సురేంద్ర చారి, జె. పరమేశ్పర్ రైతులు టీ. క్రిష్ణయ్య, కడమంచి శ్రీనివాస్ మరియు ఇతర రైతులతో కలిసి నాగర్ కుంట గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎంపిక చేసిన వాలంటీర్లకు డిజిటల్ క్రాప్ సర్వే విధానం గురించి వివరించారు.
ఈ డిజిటల్ క్రాప్ సర్వే కార్యక్రమాన్ని త్వరతగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మండల వ్యవసాయ అధికారి తెలియజేశారు.




