Ranga Reddy: రంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ!

Ranga Reddy: రంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన రెడ్డి.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 15 Aug 2026 12:49 PM IST
Ranga Reddy
X

Ranga Reddy: రంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ!

Ranga Reddy: భారతదేశం తన “80వస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది”. ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన రెడ్డి ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించిన మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహానాయకులతో పాటు అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్యం తెచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.యువత విద్య, విజ్ఞాన రంగాలలో రాణించి నవభారత నిర్మాణంలో కీలక భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, స్థానికులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story