Kadthal: కడ్తాల్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలి: శ్రీకాంత్!
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి నష్టపోయిన అన్నదాతలకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని బీఆర్‌ఎస్ యువ నాయకులు కంబాలపల్లి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
Kadthal: కడ్తాల్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలి: శ్రీకాంత్!
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని యువ నాయకులు కంబాలపల్లి శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో సుమారు 80 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, పంటలు సరిగా పండక పేద రైతులు, కౌలు రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా దేవరకొండ, చింతపల్లి మండలాలతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినప్పుడు మాడుగుల మండలాన్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. రైతుల పరిస్థితులను పరిశీలించి మాడుగుల మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించడంతో పాటు బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.




