Kandukur: రీ-సర్వే సమస్యల పరిష్కారంపై కందుకూరు ఆర్డీవో సమీక్ష!

Kandukur: రంగారెడ్డి జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో రీ-సర్వే సమస్యలు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ఆర్డీవో అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

SAI,	MAHESHWARAM
Published on: 28 Nov 2026 8:07 AM IST
Kandukur
X

Kandukur: రీ-సర్వే సమస్యల పరిష్కారంపై కందుకూరు ఆర్డీవో సమీక్ష!

కందుకూరు: రెవెన్యూ డివిజన్ పరిధిలో రీ-సర్వేకు సంబంధించిన సమస్యలు, పెండింగ్ అంశాలపై కందుకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు ఆఫ్ సర్వే, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, GPOలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, భూ సరిహద్దుల వివాదాలు, రికార్డుల్లో వ్యత్యాసాలు, పెండింగ్ దరఖాస్తులపై RDO సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన SOP నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, సంబంధిత రికార్డులు, సర్వే మ్యాపుల ఆధారంగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న అంశాలను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని, ప్రజలకు రీ-సర్వే సేవలు పారదర్శకంగా, న్యాయబద్ధంగా, సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని RDO స్పష్టం చేశారు.

SAI,	MAHESHWARAM

SAI, MAHESHWARAM