Shabad: తండ్రిని కోల్పోయిన చిన్నారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం!

Shabad: 'నాకు మా నాన్న కావాలి' అని పరీక్షలో రాసిన షాబాద్ చిన్నారి స్పర్శకు కేటీఆర్ సూచనతో మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 13 Oct 2026 7:07 PM IST
Shabad
X

Shabad: తండ్రిని కోల్పోయిన చిన్నారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం!

షాబాద్: తండ్రిని కోల్పోయిన చిన్నారి బైండ్ల స్పర్శకు షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. షాబాద్ మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన స్పర్శ ఐదో తరగతి చదువుతోంది. ఇటీవల పాఠశాలలో నిర్వహించిన పరీక్షలో ‘దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఏం అడుగుతావు?’ అనే ప్రశ్నకు ‘నాకు మా నాన్న కావాలి’ అని సమాధానం రాయడంతో ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి వెళ్లింది.

కేటీఆర్ సూచనతో ఆర్థిక సాయం

చిన్నారి పరిస్థితిపై స్పందించిన కేటీఆర్, ఆమె కుటుంబ వివరాలు తెలుసుకోవాలని మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డికి సూచించారు. దీంతో మూడు రోజుల క్రితం చిన్నారిని తన నివాసానికి పిలిపించుకున్న అవినాష్ రెడ్డి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. కేటీఆర్ సూచనతో మంగళవారం చిన్నారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

చిన్నారిని అభినందించిన కేటీఆర్

ఈ సందర్భంగా స్పర్శను కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. చిన్నారి రాసిన సమాధానం తనను ఎంతో బాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. చిన్నారికి ఆర్థిక సాయం అందించిన అవినాష్ రెడ్డిని అభినందించారు. వారం రోజుల తర్వాత చిన్నారిని తన వద్దకు తీసుకురావాలని సూచించారు.

అక్కకు ల్యాప్‌టాప్ అందిస్తానని హామీ

స్పర్శ అక్క మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ చదువుతుండటంతో ఆమెకు ల్యాప్‌టాప్ అందిస్తానని అవినాష్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్న నరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ రాధ, మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, నాయకులు గోపాల్ నాయక్, జైపాల్, రాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA