Madugula: అన్నేబోయినపల్లిలో 21 మందికి నూతన పెన్షన్ల మంజూరు
Madugula: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అన్నేబోయినపల్లిలో అర్హులైన 21 మందికి సర్పంచ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన పెన్షన్ల ప్రొసీడింగ్స్ అందజేశారు.
Madugula: అన్నేబోయినపల్లిలో 21 మందికి నూతన పెన్షన్ల మంజూరు
మాడ్గుల: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల పరిధిలోని అన్నేబోయినపల్లి గ్రామంలో అర్హులైన 21 మందికి నూతన పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆమనగంటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. మంజూరైన పెన్షన్లలో రెండు వికలాంగుల, ఎనిమిది గీత కార్మికుల, 11 వితంతు పెన్షన్లు ఉన్నాయి.
ఈ సందర్భంగా సర్పంచ్ ఆమనగంటి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వారికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొప్పుల శ్రీశైలం, వార్డు సభ్యులు పులికంటి కృష్ణయ్య, ధార శ్రీశైలం, పంచాయతీ కార్యదర్శి శంకర్, గ్రామ పెద్దలు జి. రామ్ రెడ్డి, ఎ. పర్వత్ రెడ్డి, ఎ. చంద్ర రెడ్డి, కె. చెన్నయ్య, వి. యాదయ్య, డి. అంజయ్య, జి. ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.




