Amangal: ఇందిరమ్మ ఇళ్ల శ్లాబ్ పరిమితి పెంచాలి: జంతుక శంకర్!
Amangal: ఇందిరమ్మ ఇళ్ల పథకం మార్గదర్శకాల్లో ఇంటి శ్లాబ్ విస్తీర్ణ పరిమితిని 750 నుంచి 950 చదరపు అడుగులకు పెంచాలని ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు జంతుక శంకర్ కోరారు.
Amangal: ఇందిరమ్మ ఇళ్ల శ్లాబ్ పరిమితి పెంచాలి: జంతుక శంకర్!
ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం ఇందిరమ్మ ఇళ్ల పథకం మార్గదర్శకాల్లో ఇంటి శ్లాబ్ విస్తీర్ణ పరిమితిని 750 చదరపు అడుగుల నుంచి 950 చదరపు అడుగులకు పెంచాలని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అండ్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జంతుక శంకర్ కోరారు. సోమవారం ఆమనగల్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
జీవో ఎంఎస్ నం.22ను సవరించి ఉమ్మడి కుటుంబాలు, పేద, బలహీన వర్గాల లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా శ్లాబ్ పరిమితిని పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆమనగల్ ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించేందుకు మండల పరిధిలోని అన్ని నీటి శుద్ధి కేంద్రాలను అధికారులు తక్షణమే తనిఖీ చేయాలని జంతుక శంకర్ కోరారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వాటర్ ప్లాంట్ల పరిశుభ్రత, పనితీరు, నీటి నాణ్యత ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించాలని, నిబంధనలు పాటించని కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.




