Talakondapalli: తలకొండపల్లి మండలం పడకల్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు
Talakondapalli: రంగారెడ్డి జిల్లా పడకల్‌లో వైభవంగా బోనాల పండుగ వేడుకలు. అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు, నాయకులు.
Talakondapalli: తలకొండపల్లి మండలం పడకల్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు
తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో బోనాల పండుగ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి, ఆలయ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఉప సర్పంచ్ రాఘవేందర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రవీందర్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డిగ్రీ కృష్ణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చెన్నకేశవులు, జులపల్లి శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామ పెద్దలు, యువకులు, కుల సంఘాల ప్రతినిధులు, పోలీసు సిబ్బంది, డప్పు కళాకారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. పడకల్ గ్రామంలో బోనాల ఉత్సవాలను ఇంత వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.




