Thalakondapally: పడకల్ గ్రామసభలో సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి

Thalakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామసభలో సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బాలల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 15 Nov 2026 4:08 PM IST
Thalakondapally
X

Thalakondapally: పడకల్ గ్రామసభలో సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి

తలకొండపల్లి: బాలల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పడకల్ గ్రామ సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని పడకల్ గ్రామంలో ఆమె ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, విద్యతో పాటు క్రీడలు, సంస్కారం, క్రమశిక్షణ, మంచి అలవాట్లలో చిన్నారులు రాణించాలని సూచించారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని కోరారు.

గ్రామంలోని చిన్నారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి చిన్నారి తన లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రమాదేవి, ఉపసర్పంచ్ రాఘవేందర్ గౌడ్, వార్డు సభ్యులు ఎండీ వాజిద్, విజయ్ కుమార్, నరసింహ, గ్రామ పెద్దలు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY