Rangareddy: పడకల్‌లో వైభవంగా బోనాల పండుగ వేడుకలు!
Rangareddy: తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
Rangareddy: పడకల్‌లో వైభవంగా బోనాల పండుగ వేడుకలు!
Rangareddy: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనం కుండలను నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలి గ్రామ ప్రజలు పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా అన్నారు
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ గ్రామ ప్రజలు యువకులు పెద్దలు పాల్గొన్నారు.బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. మహిళలు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.




