Madugula: ఫిరోజ్‌నగర్‌లో ఘనంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం!

Madugula: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఫిరోజ్‌నగర్‌లో యశోద ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం. పాల్గొన్న సర్పంచ్ కలకొండ జంగమ్మ శ్రీను, గ్రామస్తులు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 4 Nov 2026 2:11 PM IST
Madugula
X

Madugula: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఫిరోజ్‌నగర్ గ్రామపంచాయతీలో బుధవారం గ్రామ సర్పంచ్ కలకొండ జంగమ్మ శ్రీను, యశోద ఆసుపత్రి వారి సంయుక్త ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా యశోద ఆసుపత్రికి చెందిన వైద్యులు గ్రామానికి చేరుకుని ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన వైద్య సలహాలు, సూచనలు అందించారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు సర్పంచ్ కలకొండ జంగమ్మ శ్రీనుతో పాటు యశోద ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మొగిలి వెంకటమ్మ, కలకొండ కలమ్మ, బన్నె శేఖర్, యాతం శివ, యాతం దర్గయ్య, వైద్యులు అశోక్, విజయశ్రీ, అనుశ్రీ, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY