Amanagallu: ఆమనగల్లులో రికార్డు ధర పలికిన గణేష్ లడ్డూ
Amanagallu: ఆమనగల్లులో ఘనంగా గణేష్ లడ్డూ వేలం. రూ.2.30 లక్షలకు లడ్డూను దక్కించుకున్న కౌకుంట్ల అనూష శరత్‌రెడ్డి దంపతులు. వరుసగా మూడోసారి దక్కించుకోవడం విశేషం.
Amanagallu: ఆమనగల్లులో రికార్డు ధర పలికిన గణేష్ లడ్డూ
ఆమనగల్: ఆమనగల్లు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ కాలనీలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూ వేలం అట్టహాసంగా జరిగింది.
లడ్డూ వేలంలో రూ.2 లక్షల 30 వేల రికార్డు ధర పలకడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. పట్టణానికి చెందిన కౌకుంట్ల అనూష శరత్‌రెడ్డి దంపతులు రూ.2 లక్షల 30 వేలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. దీంతో వరుసగా మూడోసారి గణేష్ లడ్డూను దక్కించుకున్న ఘనతను వారు సొంతం చేసుకున్నారు.
అదేవిధంగా విఘ్నేశ్వరుని ధనలక్ష్మి మాలను రూ.1.71 లక్షలకు మంచుకొండ శోభారాణి చంద్రశేఖర్ దంపతులు, ఆపిల్ కలశాన్ని రూ.70 వేలకు సారంగా అర్చన శివకుమార్ దంపతులు వేలంలో దక్కించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, బజరంగ్ యూత్ సభ్యులు మంచుకొండ చంద్రశేఖర్, బాలస్వామి, మాకం సాయిబాబు, గుత్తి శేఖర్, శరత్‌రెడ్డి, గోరటి గిరి, చంద్రమౌళిగౌడ్, చందునాయక్, శంకర్, హరీష్, శేఖర్, రాహుల్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.




