Kadthal: యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలి: దశరథ్ నాయక్!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ ప్రారంభించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 1 Nov 2026 8:33 PM IST
Kadthal
X

Kadthal: యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలి: దశరథ్ నాయక్!

కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం దీపావళి పండుగను పురస్కరించుకుని కడ్తాల్ మండల పరిధిలోని ముద్విన్ గ్రామంలో స్థానిక యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ, రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి, టాస్ వేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జర్పుల దశరథ్ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికి ముద్విన్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నమెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, పట్టుదలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ముద్విన్ గ్రామ సర్పంచ్ సంధ్య వెంకటేష్, ఉపసర్పంచ్ నరసింహ, మాజీ ఉపసర్పంచ్ వినోద్, వార్డు సభ్యులు వెంకటేష్, రమేష్, బీఆర్ఎస్ నాయకులు పొట్టి శీను, గోపాల్, మహేందర్, మహేష్, హరి, రాములు, సురేందర్, క్రీడాకారులు, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY