Kadthal: సేవాలాల్ మహారాజ్ విగ్రహ భూమిపూజను విజయవంతం చేయాలి!
Kadthal: మద్దిమడుగులో రూ.169 కోట్లతో చేపట్టనున్న సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణ భూమిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సేవాలాల్ సేన నేత జర్పుల లక్పతి నాయక్ పిలుపునిచ్చారు.
Kadthal: సేవాలాల్ మహారాజ్ విగ్రహ భూమిపూజను విజయవంతం చేయాలి!
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మద్దిమడుగులో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణ భూమిపూజ కార్యక్రమం సందర్భంగా గురువారం కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండల కేంద్రంలోని గిరిజన కమిటీ హాల్లో సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని గిరిజనులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.169 కోట్ల వ్యయంతో సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణం చేపట్టడం గిరిజన సమాజానికి గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల లక్పతి నాయక్ మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ గిరిజనుల సంక్షేమానికి ఏం చేసిందని ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.169 కోట్లతో సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణం చేపడుతుంటే బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని ఖండించారు. అనంతరం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడ్తాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మార్కెట్ చైర్మన్ యాట గీత నర్సింహా, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిచ్య నాయక్, కడ్తాల్ సర్పంచ్ భిక్షపతి, సేవాలాల్ సేన రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్పుల రవీందర్ నాయక్, కడ్తాల్ మండల అధ్యక్షులు రమేష్ నాయక్, రేవంత్ వ్యవస్థాపక అధ్యక్షులు చందోజీ, సేవాలాల్ సేన మండల యువజన అధ్యక్షులు తేజు నాయక్, నాయకులు రామ్ చంద్ నాయక్, జంగీర్ బాబా, రాజు, జర్పుల సేవ్యా నాయక్, క్యామ రాజేష్, షాబుద్దీన్, మోతీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




