Meerpet: మీర్‌పేట్ అగ్నిప్రమాదం.. రంగంలోకి దిగి మంటలార్పిన ఫైర్ ఫైటర్స్
Meerpet: రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధి నందనవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Meerpet: మీర్‌పేట్ అగ్నిప్రమాదం.. రంగంలోకి దిగి మంటలార్పిన ఫైర్ ఫైటర్స్
Meerpet: రంగా రెడ్డి జిల్లా:హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధి నందనవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మెట్రో బార్ సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చలరేగి వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న మరో గోదాంను, సమీప భవనంలోని ఇళ్లను కూడా ఆవరించాయి.
స్థానికుల సమాచారం అందుకున్న వెంటనే మూడు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




