Rangareddy: కడ్తాల్ మండలంలో గుండెపోటుతో వ్యక్తి మృతి!
Rangareddy: కడ్తాల్ మండలంలో గుండెపోటుతో వ్యక్తి మృతి. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత.
Rangareddy: కడ్తాల్ మండలంలో గుండెపోటుతో వ్యక్తి మృతి!
Rangareddy: కడ్తాల్ మండల పరిధిలోని గానుగుమర్ల తండా గ్రామ పంచాయతీకి చెందిన నేనావత్ చందర్ నాయక్ రాత్రి రెండు గంటల సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు.చందర్ నాయక్ అకాల మరణం తండావాసులను తీవ్రదిగ్భ్రాంతికిగురిచేసింది.
విషయం తెలిసిన వెంటనే లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్రఉపాధ్యక్షులు, కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత జర్పుల దశరథ్ నాయక్, స్థానిక సర్పంచ్ సేవ్యా నాయక్ కలిసి మృతుడి నివాసానికి చేరుకున్నారు.చందర్ నాయక్ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఏ కష్టం వచ్చినా తాము అండగాఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శీను నాయక్ రాజు నాయక్ చాంది లక్ష్మణ్ నాయక్ నాగార్జున నాయక్ గోపి మాజీ ఉపసర్పంచ్ పాండు మాజీ వార్డు సభ్యుడు శంకర్ నాయక్ నాయకులు కిషన్ నాయక్ హరి హరియా బద్య శీను జగన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు




