Amanagallu: ఆమనగల్లు పీఏసీఎస్ చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి
Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గూడూరు శ్రీనివాస్ రెడ్డిని అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
Amanagallu: ఆమనగల్లు పీఏసీఎస్ చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి
ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం పీఏసీఎస్ చైర్మన్‌గా నియమితులై బాధ్యతలు చేపట్టిన గూడూరు శ్రీనివాస్ రెడ్డికి సోమవారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆమనగల్లు మండల పరిషత్ సమావేశ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, సిబ్బంది ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు అప్పగించిన పదవిని బాధ్యతగా భావించి రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రైతు సంక్షేమానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి సహకారంతో ఆమనగల్లు, కడ్తాల మండలాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శోభారాణి, ఎంపీడీవో జయరాం విజయ్, డీటీ వినోద్ కుమార్, ఏవో శ్రీనివాస్ గౌడ్, డీఈ, ఏడీఈ బాలకృష్ణ, సర్పంచులు శ్రీను నాయక్, యాదయ్య, వెంకటయ్య, శ్రీలత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.




