Rangareddy: కడ్తాల్‌లో ఘనంగా పోషణ మాసోత్సవాల ముగింపు!
Rangareddy: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పోషణ మాసోత్సవాల ముగింపు వేడుకలు. చిన్నారుల ఆరోగ్యానికి పౌష్టికాహారమే ముఖ్యమన్న సర్పంచ్.
Rangareddy: కడ్తాల్‌లో ఘనంగా పోషణ మాసోత్సవాల ముగింపు!
Rangareddy: చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరమని కడ్తాల్ గ్రామ సర్పంచ్ బిక్షపతి పేర్కొన్నారు. చిన్నారులకు బాల్యం నుంచే పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు బాటలు వేయవచ్చని తెలిపారు. శుక్రవారం కడ్తాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ బిక్షపతి అధ్యక్షతన, ఐసీడీఎస్ సూపర్వైజర్ హరిప్రియ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బిక్షపతి చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పిల్లల ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోషణ మాసోత్సవాల ముగింపు సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం, పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు.
చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం అంగన్‌వాడీ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్యపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ యాదగిరి రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అల్లాజి, వార్డు సభ్యులు విజయ్ కుమార్, కళ్యాణ్ కార్ భాను కిరణ్, మాజీ మండల కో-ఆప్షన్ సభ్యుడు జహంగీర్ బాబా, మల్లయ్య, అంగన్‌వాడీ టీచర్లు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.




