Amanagallu: శెట్టిపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు
Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం శెట్టిపల్లిలో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ తెల్గమల్ల జంగమ్మ-వెంకటయ్య.
Amanagallu: శెట్టిపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు
ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శెట్టిపల్లి గ్రామ సర్పంచ్ తెల్గమల్ల జంగమ్మ–వెంకటయ్య గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉపాధి హామీ పనుల్లో భాగంగా మైసమ్మ ఆలయం వద్ద కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
అనంతరం శెట్టిపల్లి గ్రామ పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.అలాగే తమ తల్లిదండ్రులకి,పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సర్పంచ్ జంగమ్మ–వెంకటయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేందర్ రెడ్డి గారు,గ్రామపంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ గారు,వార్డు సభ్యులు ఉజ్జని లక్ష్మమ్మ గారు, టి. రాములు గారు, ఫీల్డ్ అసిస్టెంట్ కొమ్ము కృష్ణయ్య గారు, ఉపాధ్యాయ బృందం,అంగన్వాడీ టీచర్లు,విద్యార్థులు,తల్లిదండ్రులు, యువతి యువకులు,యువజన సంఘాల నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




