Talakondapally: పడకల్‌లో నూతన మెడికల్ షాప్‌ను ప్రారంభించిన సర్పంచ్ సునీత
Talakondapally: తలకొండపల్లి మండలం పడకల్‌లో క్రాంతి రామ్ మెడికల్ షాప్‌ను ప్రారంభించిన సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి. యువత స్వయం ఉపాధి వైపు అడుగులేయాలని సూచన.
Talakondapally: పడకల్‌లో నూతన మెడికల్ షాప్‌ను ప్రారంభించిన సర్పంచ్ సునీత
తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో జోగు క్రాంతి కుమార్ నూతనంగా ఏర్పాటు చేసిన క్రాంతి రామ్ మెడికల్ షాప్‌ను గ్రామ సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడం అభినందనీయమని, స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థికాభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు.
నూతనంగా మెడికల్ షాప్ ఏర్పాటు చేసిన జోగు క్రాంతి కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జోగు రమేష్, వార్డు సభ్యులు జోగు విజయ్ కుమార్, ఎండీ వాజిత్, సీహెచ్ విజయ్ కుమార్, నాయకులు లట్టుపల్లి జగ్గారెడ్డి, జెల్లెల శ్రీశైలం, సీపీఎం పెంటయ్య, తిరుపతి గౌడ్, లక్ష్మీనారాయణ, ఎండీ గౌస్, బి. రమేష్, శివకుమార్, పాండు, జోగు రామచంద్రయ్య, జోగు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




