Rangareddy: బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
Rangareddy: రంగారెడ్డి జిల్లాలో బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష.
Rangareddy: బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
రంగారెడ్డి జిల్లా: వినాయక చవితి నవరాత్రులు సందర్భంగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో కలిసి బాలాపూర్ గణేష్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గణనాథుడి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ,ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని స్పీకర్ ఆకాంక్షించారు.
భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులు, యువత, భక్తులను అభినందించారు.




