Rangareddy: తలకొండపల్లిలో బోరు మోటార్ల దొంగల అరెస్ట్
Rangareddy: రంగారెడ్డి జిల్లా పడకల్ గ్రామంలో వ్యవసాయ పొలాల వద్ద బోరు మోటార్లు, స్టార్టర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Rangareddy: తలకొండపల్లిలో బోరు మోటార్ల దొంగల అరెస్ట్
Rangareddy: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం . వ్యవసాయ పొలాల వద్ద రాత్రి సమయంలో బోరు మోటార్లు, స్టార్టర్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను తలకొండపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ వి. జానకిరామ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పడకల్ గ్రామానికి చెందిన ఉదరీ మల్లేష్, గోల్సాం శ్రీనివాసులు జల్సాలకు, మద్యానికి అలవాటు పడి డబ్బులు సులభంగా సంపాదించాలని నిర్ణయించుకున్నారు.
వీరిద్దరూ కలసి పడకల్ గ్రామం శివారులో గత కొన్ని రోజుల క్రితం బోరు మోటర్ మరియు స్టార్టర్ ని దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. రెండు కేసుల్లో వీరిద్దరు ఉండగా మరొక కేసులో వీరిద్దరు అదే గ్రామానికి చెందిన మొకిరాళ్ల మల్లయ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఒక ట్రాక్టర్, టీవీఎస్ మోటర్ సైకిల్, రెండు బోరు మోటర్లు, ఒక స్టార్టర్ ని రికవరీ చేశారు.త్వరితగతిన కేసును పరిష్కరించిన ఎస్సై కె.శేఖర్ మరియు కానిస్టేబుల్స్ నాగని శ్రీనివాస్, నిరంజన్, రమేష్, జాషువాను ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ జానకిరామ్ రెడ్డి అబినందించారు.




