Talakondapally: రాజ్యాంగ హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి!

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ వట్టెల నిర్మల–శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 27 Nov 2026 8:35 AM IST
Talakondapally
X

Talakondapally: రాజ్యాంగ హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి!

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామం భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల–శ్రీశైలం యాదవ్ పిలుపునిచ్చారు.

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించిందని తెలిపారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను తెలుసుకోవడంతో పాటు పౌరులుగా తమ బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. కులమత భేదాలకు అతీతంగా సమానత్వం, సోదరభావంతో ముందుకు సాగాలని, రాజ్యాంగ విలువలను గౌరవించాలన్నారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ రవీందర్, వార్డు సభ్యులు పబ్బ రమేష్, అగ్రికల్చర్ ఆఫీసర్ అనిత, అంగన్‌వాడీ టీచర్ పద్మ, మాజీ వార్డు సభ్యులు మీసాల ఆంజనేయులు, బీఎల్ఓ మద్ది కృష్ణారెడ్డి, గ్రామ పెద్దలు సత్యనారాయణ, బోదాస్ నరసింహ, బోదాస్ శ్రీను, రమేష్, విక్రమ్, మహిళలు కిష్టమ్మ, అండాలమ్మ, సంతోష, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY