Talakondapally: రాంపూర్‌లో నిశ్చితార్థ వేడుకల్లో సర్పంచ్ దంపతులు!

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్‌లో జరిగిన రెండు కుటుంబాల నిశ్చితార్థ వేడుకల్లో సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ దంపతులు పాల్గొని ఆశీర్వదించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 1 Nov 2026 9:05 PM IST
Talakondapally
X

Talakondapally: రాంపూర్‌లో నిశ్చితార్థ వేడుకల్లో సర్పంచ్ దంపతులు!

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన అలువాల ఈశ్వరమ్మ–యాదయ్య గౌడ్ దంపతుల కుమార్తె, అలాగే అదే గ్రామానికి చెందిన రొయ్యల అలువేల గణేష్ ముదిరాజ్ దంపతుల కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులను ఆశీర్వదించి, వారి నూతన జీవితాలు సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కటికెల యాదయ్య, మాజీ సర్పంచ్ దుగ్గపురం యాదయ్య, మాజీ హనుమాన్ టెంపుల్ చైర్మన్ సప్పిడి జానయ్య, మాజీ టెంపుల్ చైర్మన్ ముక్తాల రాఘవేందర్ గౌడ్, చెరువు జనరల్ సెక్రటరీ చిలుకం శేఖర్, ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షుడు సప్పిడి పాండు, మాజీ టెంపుల్ డైరెక్టర్ ముక్తాల స్వామి గౌడ్, నరసింహ గౌడ్, ముక్తాల శీను, ముక్తాల మహిపాల్ గౌడ్, ముక్తాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY