Ibrahimpatnam: ఉప్పరిగూడలో బెల్ట్ షాపుల బంద్ గ్రామసభ తీర్మానం

Ibrahimpatnam: రంగారెడ్డి జిల్లా ఉప్పరిగూడలో బెల్ట్ షాపుల రద్దుకు గ్రామసభ తీర్మానం. మద్యం అమ్మితే కఠిన చర్యలు, జరిమానాలు ఉంటాయని సర్పంచ్ వేణి నందకుమార్ హెచ్చరిక.

RAVI, IBRHAMIPATNAM
Published on: 30 July 2026 7:59 PM IST
Ibrahimpatnam
X

Ibrahimpatnam: ఉప్పరిగూడలో బెల్ట్ షాపుల బంద్ గ్రామసభ తీర్మానం

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో మద్యం అమ్మకాలపై గ్రామసభలో గ్రామ ప్రజల వినతుల మేరకు బెల్ట్ షాప్ లలో మద్యం అమ్మకాలు జరుపవద్దని గ్రామ పాలకవర్గం తీర్మానం చేయడం జరిగింది .

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీ వేణి నందకుమార్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు మద్యపానానికి బానిసలుగా మారి తమ యొక్క భవిష్యత్తులను. ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. , గ్రామంలో మద్యపానం అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామసభలో తీర్మానించడం జరిగిందన్నారు.

ఈరోజు నుంచి గ్రామంలో మద్యపానం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జరిమానాలు కూడా విధిస్తామన్నారు.అనంతరం బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరుపుతు న్న వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందని అన్నారు. గ్రామ ప్రజల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM

Next Story