LB Nagar: అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష!

LB Nagar: 2019 సరూర్‌నగర్ అత్యాచార కేసులో నిందితుడు పైడిపోగు రాజేష్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల పరిహారం విధిస్తూ శుక్రవారం ఎల్బీనగర్ కోర్టు తీర్పునిచ్చింది.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 20 Nov 2026 4:49 PM IST
LB Nagar
X

LB Nagar: అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష!

ఎల్బీనగర్: అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌లోని 13వ అదనపు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. సరోూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2019లో నమోదైన కేసులో పైడిపోగు రాజేష్ (27)ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది.

సరోూర్‌నగర్ మండలం ఖర్మన్‌ఘాట్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన రాజేష్ ఇంట్లో అద్దెకు ఉంటున్న యువతిపై 2019 జూలై 28న తెల్లవారుజామున అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలిని వివాహం చేసుకుంటానని నమ్మించి, ఆ తర్వాత నిరాకరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని 2019 జూలై 31న అరెస్టు చేసి, సాక్ష్యాధారాలు సేకరించారు. అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ పూర్తయిన అనంతరం నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.6,100 జరిమానా విధించింది. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR