Thalakondapally: తలకొండపల్లిలో విరబూసిన అరుదైన 'బ్రహ్మ కమలం'!

Thalakondapally: అరుదైన బ్రహ్మ కమలం విరబూసింది. కాంగ్రెస్ నేత ఉప్పనమోని జుట్టు తిరుపతి ముదిరాజ్ నివాసంలో విరబూసిన పుష్పాన్ని తిలకించేందుకు తరలివచ్చిన జనం.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 13 Aug 2026 10:58 PM IST
Thalakondapally
X

Thalakondapally: తలకొండపల్లిలో విరబూసిన అరుదైన 'బ్రహ్మ కమలం'!

తలకొండపల్లి: తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పనమోని జుట్టు తిరుపతి ముదిరాజ్ ఇంట్లో అరుదైన బ్రహ్మ కమలం పువ్వు విరబూసింది.బ్రహ్మ కమలం అనేది చాలా అరుదైన పుష్పం ఏడాదికి ఒకసారి మాత్రమే,అది కూడా రాత్రి సమయంలో పూసి తెల్లవారేలోపు వాడిపోతుంది.

బ్రహ్మ కమలం విరబూసిన దృశ్యాన్ని చూసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.హిందూ సంప్రదాయంలో ఈ పువ్వుకు ఎంతో విశిష్టత ఉందని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇంట్లో ఈ మొక్క ఉంటే శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం.ఈ పుష్పం నుండి అద్భుతమైన సువాసన వస్తుంది. సాధారణంగా ఒకటి పూసినా చూడటానికి జనం వస్తుంటారు. బ్రహ్మ కమలాన్ని చూడటం అదృష్టంగా భావిస్తున్నారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story